మధుమేహంపై అవగాహనతోనే... "ఆరోగ్యకరమైన జీవనం." - ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో డయాబెటిస్ వాక్.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: మధుమేహ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం నిజామాబాద్ రీజియన్ లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో డయాబెటిస్ వాక్ నిర్వహించారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన ఈవాక్ హైదరాబాద్ రోడ్, పూలాంగ్ మీదుగా వినాయకనగర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇరుకుల వీరేశం మాట్లాడుతూ.. మధుమేహ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్తలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారు...