ఆర్మూర్ : జనరల్ ఎన్నికలను తలపించేలా.. ‘నలంద’లో మాక్ ఎన్నికల సందడి!

- 13న మాక్ ఎన్నికలు.. విద్యార్థుల హోరాహోరీ ప్రచారం.. - ఈవీఎంలతో ఓటింగ్‌కు ఏర్పాట్లు. - ఎన్నికల ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన కల్పించాలనే లక్ష్యంతో పాఠశాల యాజమాన్యం వినూత్న కార్యక్రమం. "జనరల్ ఎన్నికలను తలపించేలా పాఠశాల ప్రాంగణంలో ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్థుల ప్రచారాలు, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు, ప్రజాస్వామ్య నినాదాలతో విద్యార్థులు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్‌లో ఈ నెల 13న నిర్వహించనున్న మాక్ ఎన్నికలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి." *వేగుచుక్క న్యూస్, ఆర్మూర్:* విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, ఎన్నికల ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన కల్పించాలనే లక్ష్యంతో పాఠశాల యాజమాన్యం ఈ...