ఆర్మూర్: నలంద విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు. - ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో సత్తా చాటిన విద్యార్థులు.

- అభినందించిన పాఠశాల యాజమాన్యం ప్రసాద్, సాగర్. వేగుచుక్క న్యూస్, ఆర్మూర్: పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారు. అభ్యస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో గత నెల 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో నలంద పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 పాఠశాలలకు చెందిన 500 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీ పరీక్షలో నలంద విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం విశేషం. ఈ పరీక్షలో ఐదో తరగతి చదువుతున్న జీ. ధనుశ్రీ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు, తొమ్మిదో తరగతి విద్యార్థి కే. నితీష్ ద్వితీయ ర్యాంకు,...