నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్.. అధికారిక వెబ్‌సైట్‌ ప్రారంబించిన సిపి.

- సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రారంభించిన పోలీస్ కమిషనర్. వేగుచుక్క న్యూస్: నిజామాబాద్ జిల్లా సెక్యూరిటీ కౌన్సిల్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను బుధవారం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సెక్యూరిటీ కౌన్సిల్ చేపడుతున్న కార్యక్రమాలు , కార్యకలాపాలు మరియు భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంలో అధికారిక వెబ్‌సైట్‌ , సోషల్ మీడియా వేదికలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడం...