చెత్త కుప్పల్లో కూర్చొని "కౌన్సిలర్ నిరసన". - కామారెడ్డి మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం!

- పట్టించుకోని అధికారులకు వినూత్న నిరసనతో షాక్.. - పట్టణాన్ని డంపింగ్ యార్డుగా మార్చారంటూ మండిపాటు. వేగుచుక్క న్యూస్: కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసనతో పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. స్థానిక కౌన్సిలర్లు, ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన 46వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. తన వార్డులో పేరుకుపోయిన చెత్త కుప్పల్లోనే కూర్చొని మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...