ఓయూ , హైదరాబాద్ :యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను పెంచాలి..నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎల్. మూర్తి.
- అన్ని విశ్వవిద్యాలయాల్లో పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి. - ఓయూ లో నిరసన కార్యక్రమం. వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను పెంచాలనీ, అన్ని విశ్వవిద్యాలయాల్లో పారదర్శకంగా నియామకాలు చేపట్టాలనీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎల్. మూర్తి డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిరుద్యోగ జేఏసీ, ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సంతకాల సేకరణతో కూడిన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆర్.ఎల్. మూర్తి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ...