నిజామాబాద్: బీజేపీ గెలిచిందని ఆర్ వోబీపై నిర్లక్ష్యమా..మాధవ్ నగర్ ధర్నాలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ధ్వజం.....

* అవసరమైతే అసెంబ్లీలో ధర్నా చేస్తా... వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: ఇందూరులో బీజేపీ గెలిచిందని మాధవ్ నగర్ ఆర్ఓబిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. నగర శివారులోని మాధవనగర్ ఆర్ వోబీ పనుల జాప్యంపై మంగళవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...తాను ఇక్కడకి ఎమ్మెల్యేగా కాదని, మీలో ఒకడిగా మీ బాధను పంచుకోవడానికి వచ్చానన్నారు. ఈ మాధవ్ నగర్ గేటుతో నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం ఈ రోడ్డు మీదుగా అన్ని రకాల వాహనాలు సుమారు 4 నుంచి 5 వేల వరకు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. అలాగే ప్రతిరోజు 24 గంటల్లో...