నేటి తరానికి ఆదర్శం ఆ "స్నేహితులు.. - 37 ఏళ్లుగా చెక్కుచెదరని స్నేహబంధం..
- ప్రతి ఏడాది దసరా మరుసటి రోజు అసలైన పండుగ వీరికి. - ఘనంగా బాల్య మిత్రుల ‘హాలాయ్ బలాయ్’! - చిన్ననాటి జ్ఞాపకాల నెమరువేత.. కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ.. సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా పూర్వ విద్యార్థులు "కాలం మారినా.. చదువులు పూర్తయి దశాబ్దాలు గడిచినా.. బాల్య స్నేహానికి మాత్రం ఎలాంటి హద్దులు ఉండవని నిరూపించారు నిజామాబాద్ నగరంలోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (మాణిక్య భవన్) 1988-89 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. పది కాదు, ఇరవై కాదు... 37 ఏళ్లుగా తమ స్నేహాన్ని ఎన్నడూ వీడకుండా నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరు, ఎక్కడ, ఏ ఊరిలో ఉద్యోగాలు, కుటుంబాలతో జీవిస్తున్న దసరా...