లాలన వృద్ధాశ్రమంలో... ఆప్యాయత పంచిన సిపి. - వృద్ధుల బాగోగులు క్షుణ్ణంగా తెలుసుకున్న పోలీస్ కమిషనర్.

- సుమారు 60 మంది వృద్ధులకు దుస్తుల పంపిణీ , స్వయంగా భోజనం వడ్డింపు. - ప్రముఖ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహణ. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: వృద్ధుల పట్ల మానవత్వం, ఆప్యాయత, సామాజిక బాధ్యతను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య చాటారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకాపూర్ గ్రామంలోని లాలన వృద్ధాశ్రమాన్ని గురువారం సిపి సందర్శించారు. వృద్ధాశ్రమంలో నివసిస్తున్న సుమారు 60 మంది వృద్ధుల బాగోగులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని , వారి ఆరోగ్య పరిస్థితులు , జీవన విధానం, వ్యక్తిగత సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వృద్ధాశ్రమంలోని ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడిన పోలీస్ కమిషనర్ ,...