ఓ తల్లి దుఃఖ గీతం.. - నేరెళ్ల బాధిత కుటుంబం పడుతున్న వేదన లోంచి..
- క్షేత్రస్థాయి నుంచి ప్రత్యేక కథనం.. *వేగుచుక్క న్యూస్:* సిరిసిల్ల అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రచారాలు వేరు.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వేరు. రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కుదిపేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటన గురించి తెలియని వారు ఉండరు. అయితే విస్మరించబడిన ఓ బాధిత కుటుంబానికి సహాయం కూడా అందని పరిస్థితి. ఓ తల్లి పడుతున్న దుఃఖం కలచివేస్తుంటె నేరెళ్ల బాధిత కుటుంబంలో ఓ తల్లి పడుతున్న దుఃఖ గీతమే కథనం. నేరెళ్ల ఇసుక లారీల కు బలైన మొదటి రైతు గంధం మల్లేశం . గంధం మల్లేశం కుటుంబం ఇసుక లారీల వేటుకు చిన్నాభిన్నమైంది. గంధం మల్లేశం భార్య భాగ్యమ్మ ఇప్పటికీ...