సైక్లింగ్ లో సత్తా చాటాలి...నిజామాబాద్ ఎంపీ అరవింద్.

దేశంలోనే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జిల్లా నుంచి రావడం సంతోషం అని వెల్లడి. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: విద్యార్థులు, యువత సైక్లింగ్ క్రీడల్లో మరింతగా రాణించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆకాంక్షించారు. ఖేలో ఇండియా ఆధ్వర్యంలో ఇందూరు బైపాస్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అస్మిత రోడ్ సైక్లింగ్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... రోడ్ సైక్లింగ్ పోటీలకు దేశంలోనే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు నిజామాబాద్ నుంచి నమోదుకావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. జిల్లాలో సైక్లింగ్ పై యువతలో పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమన్నారు....