బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.39 లక్షలు.

వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఆసక్తిగా ఎదురుచూసే బాలాపూర్ గణేష్ లడ్డూ ఈ సారి రూ.39 లక్షల రీకార్డు ధర పలికింది. లడ్డూ వేలంలో సామా ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది లడ్డూ వేలంలో రూ.35 లక్షలు పలుకగా ఈసారి మూడు లక్షలు అదనంగా పెరిగింది. బాలాపూర్ లడ్డూ వేలానికి దేశ వ్యాప్తంగా ఓ హిస్టరి ఉంది. 32 సంవత్సరాల క్రితం మొదలైన లడ్డూ వేలం ఇప్పటికి రికార్డు స్థాయిలో ధర పలుకుతూ వస్తోంది. 1994లో లడ్డు రూ.450 వేలంలో భక్తుడు దక్కించుకోగా, ప్రతి ఏటా ఊహించని విధంగా పెరుగుతూ వస్తుంది.