అంత్యోదయ సిద్దాంతం ఎంతో గొప్పది.. * దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్...
ఇందూరు: దీన్ దయాళ్ ఉపాధ్యాయ అందించిన అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి పురస్కరించుకొని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సమాజంలోని చివరి వరుసలో ఉన్న వ్యక్తి అభివృద్ధి చెందే వరకు దేశ అభివృద్ధి పూర్తికాదనే ఆలోచన అంత్యోదయ సిద్దాంతంలో ఉందన్నారు. భారతీయ ఆలోచనా విధానానికి, దేశసేవకు, సామాజిక సమరసతకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అన్నారు. రాజకీయాన్ని కేవలం అధికార సాధనంగా కాకుండా సమాజసేవకు ఒక మార్గంగా చూడాలనే భావనతో ఆయన పనిచేశారన్నారు. దీనదయాళ్...