ధర్పల్లి : ప్రేమించి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య. - అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధం కావడంతో ఘాతుకం.

వేగుచుక్క న్యూస్, ధర్పల్లి: ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు నిండు ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వెల్లడించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మరియా తండాలో చోటు చేసుకుంది. మరియ తండాకు చెందిన బానోత్ విజయ్(22) స్థానికంగా ఓ యువతిని కొన్నాళ్లుగా ప్రేమించాడు. అయితే ఆ యువతి విజయ్ కాకుండా మరొకరితో పెళ్లికి సిద్ధమైందని అని వీడియోలో తెలిపాడు. అమ్మా,నాన్నలు బాగుండాలని తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని...