కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం. - 8 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి.

వేగుచుక్క న్యూస్: కేరళంలోని త్రిశూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. కైపమంగళం ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ కారు గురువాయుర్ నుంచి కొడుంగళూరు వెళ్తుండగా హైవేపై లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునజ్జయ్యింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అతికష్టమ్మీద కారులోని వారిని బయటకు తీశారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 8 మంది ఉండగా.. ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు కేరళం పోలీసులు తెలిపారు. మృతులంతా తమిళనాడులోని...