ఎంపీ అరవింద్ కు అరుదైన అవకాశం. - ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమెండ్మెంట్ బిల్ జాయింట్ కమిటీ సభ్యుడుగా నియామకం.

వేగుచుక్క న్యూస్, న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్, 2026పై ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం లోక్‌సభ విడుదల చేసిన అధికారిక బులెటిన్‌లో జాయింట్ కమిటీ సభ్యుల జాబితాలో అర్వింద్ ధర్మపురి పేరు నమోదైంది. ఈ కమిటీలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 31 మంది సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమైన బాధ్యతను నిర్వర్తించే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ...