ప్రైవేట్ పాఠశాలల రక్షణకు కఠిన చట్టాలు తేవాలి. - నిజామాబాద్ సీపీకి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వినతి.
*వేగుచుక్క న్యూస్,* *ఆర్మూర్, ఆగస్టు 26:* ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల రక్షణకు కఠిన చట్టాలు తేవాలనీ ట్రస్మ, ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఇటీవల నల్గొండలో జరిగిన రూపారెడ్డి హత్యను వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్యను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఘటన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మరియు ప్రైవేట్ ఉపాధ్యాయుల రక్షణ కోసం కఠిన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు చట్టాలపై,...