రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది. - పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి. - పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా.
- 'సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్, రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటో లు అందించి అభినందించారు. అనంతరం గవర్నర్ పసుపు రైతులను...