నిజామాబాద్: ముసాయిదా ఓటరు జాబితా విడుదల. - సెప్టెంబర్ 16లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, మార్పులు, సవరణలకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్, ఆగస్టు 17 : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా సోమవారం విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను ప్రతి అర్హత కలిగిన ఓటరు పరిశీలించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా మార్పులు, సవరణలు అవసరమైనా సెప్టెంబర్ 16, 2026లోగా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఎస్ఐఆర్ - 2026 ప్రక్రియకు పూర్వం 14,39,734 మంది ఓటర్లు...