92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు. - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి.
వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 92 లక్షల మందికి నోటీసులు ఇస్తామన్నారు. 73 లక్షల మంది ఏఎల్డీ (ఆబ్సెంట్, షిప్టెడ్, డూప్లికేట్) జాబితాలో ఉన్నారని సీఈవో తెలిపారు. నోటీసులు అందుకున్న వ్యక్తులకు సెప్టెంబర్ 16 వరకు గడువుందని.. ఆలోపు సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఎవరి ఓట్లు అయినా లేకపోతే ఫారం 6ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.