నిజామాబాద్: ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం అదృష్టం...పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇందూరు యువత ప్రతిభకు అవకాశం కల్పించడం కోసం మెగా జాబ్ మేళా... - ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్ లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ... ఇంత పెద్ద మొత్తంలో జాబ్ మేళా నిర్వహించటం అభినందనీయమన్నారు. రాజకీయంతో పాటు ప్రజల అభివృద్ధికి పాటుపడే వారు అరుదుగా ఉంటారన్నారు. ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టెక్నాలజీని వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కానీ అదే టెక్నాలజీకి వ్యసనం కాకూడదని సూచించారు. ఉద్యోగాలు రానివాళ్లు నిరాశ చెందకుండా మరింత ప్రయత్నించాలన్నారు....