ఆర్మూర్: "నలంద"లో వైభవంగా "బోనాల పండుగ" సంబరాలు. - విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలి. - చార్టెడ్ అకౌంటెంట్ , ప్రముఖ సామాజికవేత్త ఈరవత్రి రాజశేఖర్.
- ఆటపాటలతో అలరించిన విద్యార్థులు. వేగుచుక్క న్యూస్, ఆర్మూర్: పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్లో బోనాల పండుగ, ఫ్రెషర్స్ పార్టీ సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ చార్టెడ్ అకౌంటెంట్ , ప్రముఖ సామాజికవేత్త ఈరవత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా బోనాల పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని దాని అనుగుణంగా చదువుకోవాలని, అందరిపై అమ్మవారి కటాక్షం ఉండాలని తెలిపారు. కార్యక్రమం బాగంగా అమ్మవారి దీపాలని ఎత్తుకున్న విద్యార్థులను, పోతురాజుల వేషధారణ వేసిన విద్యార్థులను అభినందించారు. *నలంద స్కూల్ కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ,*...