పెళ్లి పిలుపు మాత్రమే కాదు... ప్రకృతికి పచ్చని కానుక..! - ఒక్కో వెడ్డింగ్ కార్డ్... ఒక తులసి మొక్క..!.. మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త మంచాల జ్ఞానేందర్ గుప్తా వినూత్న ఆలోచన .

- పర్యావరణ పరిరక్షణకు పెళ్లి వేడుకనే వేదికగా మార్చిన శ్రీ వారాహి దేవాలయ ధర్మకర్త. మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త మంచాల జ్ఞానేందర్ గుప్తా. "పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వర్తించాలనే సందేశాన్ని వినూత్నంగా చాటుతూ, ఓ కుటుంబం పెళ్లి ఆహ్వాన పత్రికనే ప్రకృతికి కానుకగా మార్చింది. సాధారణంగా పెళ్లి అనంతరం చెత్తబుట్టలో చేరే ఆహ్వాన పత్రికలు ఈసారి తులసి మొక్కలుగా మారనున్నాయి." *వేగుచుక్క న్యూస్, నిజామాబాద్* : శ్రీ వారాహి దేవాలయ ధర్మకర్త, మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త అయిన మంచాల జ్ఞానేందర్ గుప్తా, ప్రస్తుతం నిజామాబాద్‌లో వ్యాపారం నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లోనూ...