నిజామాబాద్: నగర "సమగ్రాభివృద్ధి" లక్ష్యంగా ముందుకు..అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ...
- జీజీహెచ్ లో మౌలిక వసతులపై మంత్రికి వినతి... - ఆర్ వోబీ..ఆర్ యూబీ..నిర్మాణం, బస్ స్టాండ్ ఆధునికీకరణ కోసం మంత్రులను కలిశా... వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తన ప్రతి అడుగు ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ళు గడిచినా..నియోజకవర్గ అభివృద్ధి కోసం నయాపైసా ఇవ్వడం లేదన్నారు. నగర మేయర్, కార్పొరేషన్ కమిషనర్ నగరంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి చెందిన వారికి నిధులు ఇస్తున్నారు తప్ప, ప్రస్తుత ప్రజా ప్రతినిధులకు...