వడ్డెరలు "ఐక్యంగా పోరాడితేనే" హక్కులు సాధ్యం. - జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు ఫీట్ల శ్రీధర్.
- వడ్డెర సంఘం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా అవగాహన సదస్సులో... వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: స్వాతంత్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్న వడ్డెరుల బతుకుల్లో వెలుగులు లేవని, ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకోవాలని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు ఫీట్ల శ్రీ ధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వడ్డెర కులస్థుల బతుకులు మారాలంటే ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలు నిర్మించాలని అన్నారు. వడ్డెరల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సంఘటితంగా ముందుకు సాగితేనే వడ్డెరల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమ పథకాలు ప్రతి...