నిజామాబాద్: ప్రశ్నించే గొంతులపై నిర్బంధమా?.. - విద్యార్థి సంఘాల నాయకులపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. - వామపక్ష పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: విద్యార్థి సంఘాల నాయకులపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలనీ వామపక్ష పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఎన్ఎస్ యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్ యు, తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంకు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం అధ్యక్షత వయించగా, ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమన్న లు...