నిజామాబాద్: న్యాయం కోసం... తెలంగాణ"ధూంధాం కళాకారుల నగారా". - అర్హులైన వారికి ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ డిమాండ్. - బోనాల జాతరతో వినూత్న నిరసన.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: న్యాయం కోసం... "తెలంగాణ ధూంధాం కళాకారులు నగారా" మోగించారు. ప్రభుత్వం అర్హులైన వారికి ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. అమ్మవారి బోనాల జాతరతో వినూత్న నిరసన చేపట్టారు. తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మాక్లూర్ మండలంలోని ఓట్యాట్ పల్లి లో ఒడ్డేటవ్వ వద్ద బోనాలు సమర్పించారు. ముందుగా గ్రామంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కళాకారులు పూల మాల వేశారు. కామన్ నుంచి డప్పు దరువులతో శివ సత్తుల, పోతరాజు నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులు తెలంగాణ ఉద్యమ పాటలతో ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా...