కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పేరుతో మోసం.. - కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి. - ముగ్గురు నిందితుల అరెస్ట్.

వేగుచుక్క న్యూస్, కామారెడ్డి: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అక్రమంగా లబ్ధి పొందుతున్న ముఠాగుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ చందారి సంతోష్ తన పేరుతో నకిలీ సంతకాలు చేసి, అధికారిక రబ్బరు ముద్రను దుర్వినియోగం చేస్తూ వయస్సు,...