సస్పెండ్ చేసిన నర్సులను విధుల్లోకి తీసుకోవాలి. - తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ డిమాండ్. - బాన్సువాడ ఆసుపత్రి వద్ద ధర్నా.

వేగుచుక్క న్యూస్, బాన్సువాడ: అసత్య ఆరోపణలతో బాన్సువాడ మాతశిశు సంరక్షణ ఆస్పత్రి లొ సస్పెండ్ చేసిన ఇద్దరు నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ నాయకులు ఆరోగ్య జ్యోతి, జూలియన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బాన్సువాడ ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత పది సంవత్సరాల నుండి బాన్సువాడ ఆసుపత్రికి ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే ఇక్కడ పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ కృషి ఫలితంగానేనని అన్నారు. ఆపరేషన్ థియేటర్ లో అన్ని పరికరాలు బాగున్నాయని, అయిన కమిటీ నివేదిక పేరుతో ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్స్ ను సస్పెండ్ చేయడం దారుణమని...