కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్. - నిజామాబాద్ పార్లమెంట్ పరిధి రైల్వే ప్రాజెక్టులపై వినతి.
వేగుచుక్క న్యూస్, డిల్లీ: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వేలకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలని, అలాగే డిచ్‌పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్...