కామారెడ్డి: క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో... ఆగష్టు 10న "జైల్ భరో". - కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి. - సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్

. వేగుచుక్క న్యూస్, కామారెడ్డి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో... ఆగష్టు 10న "జైల్ భరో" కార్యక్రమం నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో శుక్రవారం సీఐటీయు, రైతు, వ్యవసాయ కార్మిక, వృత్తిదారులు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన, వృత్తిదారుల ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం స్వాతంత్ర రాకముందే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను...