ఘనంగా టీజీఏ ఆవిర్భావ దినోత్సవం.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నాలుగు సంఘాల్లో ఒకటైన జాతీయ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను, జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు జి. సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని మానసిక వికలాంగుల (స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రుక్షన్) ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు బిస్కెట్లు తదితర వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ... టీజీఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కెవి రమణారావు, ప్రధాన కార్యదర్శి గోరి నేతృత్వంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాటం సాగుతోందని...