విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి. - టీయూ రిజిస్ట్రార్ యాదగిరి.- టీయూ దక్షిణ ప్రాంగణంలో ఘనంగా "తరంగ్–2026" వార్షికోత్సవం.
- ఆటపాటలతో అలరించిన విద్యార్థులు. వేగుచుక్క న్యూస్, కామారెడ్డి, జూలై 22: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలనీ టీయూ రిజిస్ట్రార్ యాదగిరి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన "తరంగ్–2026" వార్షికోత్సవం కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కావని, విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలు వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటాలని సూచించారు. లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. *సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ,* సౌత్...