నిజామాబాద్ : చేనేత సంఘం అద్యక్షురాలిగా రాజేశ్వరి ఎన్నిక.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్ చేనేత సహకార సంఘం ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. చేనేత సంఘం అద్యక్షురాలిగా గుజ్జ రాజేశ్వరి ఎన్నికయ్యారు. నిజామాబాదు చేనేత సహకార సంఘం ఎన్నికలు మంగళవారం నగరంలోని చేనేత సంఘ భవనంలో జరగగా డైరెక్టర్లుగా గెలుపొందిన వారు గురువారం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాద్యక్షులను ఎన్నుకున్నారు. నాలుగు పదవులకు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగాయి. ఉపాద్యక్ష పదవికి మూడు నామినేషన్లు దాఖలు కాగా మిగిలిన పదవులకు రెండు నామినేషన్ల చొప్పున దాఖలయ్యాయి. అధ్యక్ష పదవితో పాటు ఉపాద్యక్ష పదవికి కూడా నామినేషన్ వేసిన డైరెక్టర్ గుద్దేటి రామకృష్ణ ఉపాద్యక్ష పదవికి వేసిన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం నాలుగు పదవులకు గానూ...