ఖాకీ "బలగం"... - సమాజానికి ఆదర్శంగా.. 2014 బ్యాచ్ ఎస్ఐలు. - రక్త బంధం కంటే స్నేహ బంధం గొప్పదని చాటుతున్నారు.. - మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి రూ.25 లక్షలు అందించిన సహచరులు.
*"కాకి బలగం అనే సామెతను నిజం చేస్తూ... ఖాకీలు తమ సహచరుని కుటుంబానికి అండగా నిలబడి, నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. రక్త బంధం కంటే తమ స్నేహ బంధం గొప్పదని చాటుతున్నారు.. 2014 బ్యాచ్ కు చెందిన ఎస్ఐలు. తమ బ్యాచ్ మేట్ కుటుంబానికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. క్యాన్సర్ తో పోరాడుతూ ఇటీవల మృతి చెందిన ఎస్ఐ వెంకటనారాయణ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు."* *వేగుచుక్క న్యూస్:* సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన జి. వెంకటనారాయణ 2014లో సన్ఇన్పెక్టర్గా ఎంపికై, కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించారు. క్యాన్సర్ వ్యాధితో...