వైశ్యులు ఐక్యతగా ఉండాలి . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ. పట్టణ వైశ్య సంఘం ఆధ్వర్యంలో వనభోజనం..

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్:: వైశ్యులంతా ఐక్యతగా ఉండాలని రాజకీయంగా ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర తిరుమలలో వనభోజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆషాడ మాసంలో ప్రతి సంవత్సరం వనభోజనాలను ఆనవాయితీగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆటపాటలతో వైశ్యులంతా ఒక చోటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. వైశ్యులంతా ఐక్యతగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలన్నారు. వైశ్యులు అంటే కేవలం వ్యాపారమే కాదని ఆధ్యాత్మికత, ఆలయ అభివృద్ధిలో ముందుంటారని గుర్తు చేశారు. ప్రధానంగా సేవా కార్యక్రమాల్లో వైశ్యులకు సాటి ఎవరు లేరన్నారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ...