తెలంగాణ సంస్కృతికి ప్రతీక "బోనం".. - పలు సంఘాల బోనాల పండుగలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ బోనాలు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని కోటగల్లిలో గల కట్ట మైసమ్మ ఆలయం, నాందేవ్ వాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆషాఢ మాసం తెలంగాణకు ప్రత్యేక మాసం అన్నారు. గ్రామ దేవతలకు పూజిస్తూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని కొలిచే పండగ అన్నారు. బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదని, ఇది మన పూర్వీకుల సంప్రదాయాన్ని.. గ్రామదేవతల పట్ల ఉన్న విశ్వాసాన్ని తరతరాలకు అందించే ఆధ్యాత్మిక వేడుక...