కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. - సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షకు ప్రజాసంఘాల సంపూర్ణ మద్దతు.
వేగుచుక్క న్యూస్, కామారెడ్డి: నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ప్రఖ్యాత శాస్త్రవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 13 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గత 20 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి...