"పర్యావరణాన్ని పరిరక్షిద్దాం - సుస్థిర భవిష్యత్తును నిర్మిద్దాం." - సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య.
- పాఠశాలలో పర్యావరణ - పరిరక్షణ ప్రతిజ్ఞ. వేగుచుక్క న్యూస్, సిరికొండ: "పర్యావరణాన్ని పరిరక్షిద్దాం - సుస్థిర భవిష్యత్తును నిర్మిద్దాం అని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య పిలుపునిచ్చారు. సత్యశోధక్ పాఠశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రకృతిని పరిరక్షించడం, నీరు, విద్యుత్ వంటి సహజ వనరులను పొదుపుగా వినియోగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మొక్కలను నాటి సంరక్షించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవర్చుకోవడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేశారు. ఈ...