జర్నలిస్టుల సమస్యలపై "టిడబ్ల్యుజేఎఫ్ జంగ్". - ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకుని పరిష్కరించాలనీ డిమాండ్. - మీడియా అకాడమీ చైర్మన్ వివక్షత ధోరణి వీడాలని వెల్లడి. - సమాచార్ భవన్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన. - వందలాదిగా తరలివచ్చిన జర్నలిస్టులు
వేగుచుక్క న్యూస్, హైదరాబాద్, జులై 15: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నిత్యం అష్ట, కష్టాలను అనుభవిస్తున్న పాత్రికేయుల ఇబ్బందులను మానవతా దృక్పథంతో అర్థంచేసుకుని యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లోని సమాచార శాఖ కమిషనరేట్ ఎదుట జరిగిన ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వండాలాది మంది జర్నలిస్టులు హాజరై...తమ సమస్యలు పరిష్కరించాలని ప్లకార్డులు పట్టుకొని పెద్దపెట్టున నినాదాలు చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఉచిత ఆర్టీసీ...