హైదరాబాద్ :*ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై ఐక్య ఉద్యమం* *- యుయస్పీసి స్టీరింగ్ కమిటీ నిర్ణయం.*

వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు మరియు విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలసి ఐక్య పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో టిటిఎ అధ్యక్షుడు ఎస్ హరికృష్ణ అధ్యక్షతన జరిగింది. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక విద్యకు నష్టదాయకమైన జిఒ 25 ను సవరించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, పిఒ...