తాగునీటిని వృధా చేస్తే జరిమానా విధింపు* *కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి*

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్, జూలై 14 : ఎక్కడ కూడా తాగునీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో రూ. 10 వేలు, గ్రామ పంచాయతీల పరిధిలో రూ. 5వేల జరిమానా విధించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తాగునీటి సరఫరా, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పెంపుదల తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగు, సాగునీటి అవసరాలకు అవి ఏమేరకు సరిపోతాయి తదితర వివరాలను...