మిట్టపల్లి సురేందర్ కు.. "మాభూమి - డా.దాశరథి" ప్రజా సాహిత్య పురస్కారం. - కష్ట జీవుల కన్నీళ్లు, కడగల్లే నా పాటకు వస్తువులు. - పురస్కార గ్రహీత, కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్.
- తెలంగాణను జాగృత పరిచిన కవి దాశరథి. - విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి. వేగుచుక్క న్యూస్ , హైదరాబాద్ : నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి, తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు తెలంగాణను జాగృత పరిచిన గొప్ప కవి దాశరథి అని హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ జి.రాధారాణి అన్నారు. దాశరథి వంటి కవులు ఆ కాలంలో ఉర్దూ చదివినా.. తెలుగును, సంస్కృతిని కాపాడుతూ వచ్చారన్నారు. మా భూమి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ దాశరథి రంగాచార్య ప్రజా సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్ కు అందజేశారు. ఆదివారం రాత్రి వనస్థలిపురం ఎఫ్ సిఐ కాలనీ కమ్యూనిటీ...