విప్లవోద్యమ చరిత్రలో "అరుణోదయ నాగన్న" గొంతు చిరస్మరణీయం. - ప్రజాకవి, వాగ్గేయకారుడు జయరాజ్.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: విప్లవోద్యమ చరిత్రలో అరుణోదయ నాగన్న గొంతు చిరస్మరణీయమని ప్రముఖ ప్రజాకవి వాగ్గేయకారుడు జయరాజ్ అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పరకాల నాగన్న సంస్మరణ సభ శనివారం నిజామాబాద్ నగరంలో కోటగల్లి, నీలం రామచంద్రయ్య భవన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరైన జయరాజ్ మాట్లాడుతూ, సూర్యుడు రాకముందే నిద్రలేపేది నాగన్న పాట అని, రాత్రి జోల పాట పాడేది పల్లెల్లో వెలుగులు నింపేది నాగన్న పాటేనని, సాధారణ జీవితముతో ఎంతో ఆదర్శంగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారనీ, ఎందరో అమరవీరుల త్యాగాలు ఆయన గొంతును అమలుకొని ఉద్యమ స్ఫూర్తిని నింపాయని అన్నారు. నాగన్న పాటలతో ప్రభుత్వాలను ప్రశ్నించాడు,...