నిజామాబాద్ జిల్లా: రెంజల్ "మోడల్ స్కూల్ "లో అవినీతి. - ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ డిమాండ్.

వేగుచుక్క న్యూస్: నిజామాబాదు జిల్లా రెంజల్ మండలంలోని మోడల్ స్కూల్‌లో జరుగుతున్న భారీ కుంభకోణం, ప్రిన్సిపాల్ ఫిరోజ్ అక్రమాలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూల్‌లో విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్‌ను పూర్తిగా విధుల నుండి తక్షణమే తొలగించాలని వారు ఏబీవీపీ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎబివిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ మాట్లాడారు. రెంజల్ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ అండతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారితో ప్రిన్సిపాల్ కుమ్మక్కై, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా...