కవిత ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి. - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అర్వింద్ ధర్మపురి.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: స్వయంగా కెసిఆర్ కుటుంబ సభ్యురాలు,ఇంటి మనిషి కవిత బి ఆర్ ఎస్ పార్టీ ,కేటీఆర్ ,హరీష్ రావుల మీద చేసిన అవినీతి,క్విడ్ ప్రో కో ఆరోపణల మీద సిబిఐ చేత వెంటనే విచారణ జరిపించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నిధులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌తో జరిగినట్లు ఆరోపించిన ఒప్పందాలు, ఫీనిక్స్ సంస్థకు రాజకీయ అండ, గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లకు భూముల కేటాయింపులపై కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు...