శ్రీవారాహీమాత" గర్భగుడి పనులకు ఘనంగా శ్రీకారం. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్.
ప్రత్యేక పూజల నడుమ కృష్ణశిలతో ప్రారంభమైన గర్భాలయ నిర్మాణం. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్, జూలై 9: నగరంలోని అమ్మ వెంచర్‌లో నిర్మితమవుతున్న శ్రీ వారాహీమాత దేవాలయంలో అత్యంత పవిత్రమైన గర్భగుడి నిర్మాణ పనులకు గురువారం ఘనంగా శ్రీకారం చుట్టారు. ఆలయ గర్భాలయ నిర్మాణానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ శంకుస్థాపన నిర్వహించి, కృష్ణశిల స్టోన్‌తో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. గురువారం దశమి తిథిన, ఆషాఢ మాసం ప్రారంభానికి ముందు, అలాగే వారాహి నవరాత్రులు ప్రారంభానికి ముందే ఈ పుణ్యకార్యాన్ని నిర్వహించడం అత్యంత...