గల్ఫ్ దేశంలో "మెకానికల్ ఇంజనీర్" అనుమానస్పద మృతి. - అవసరం కోసం పిలిచి హతమార్చారా ?
- మూడు నెలల మిస్టరీకి తెర. - పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసిన కువైట్ పోలీసులు. - అదుపులో నిందితుడు.. మరొకరు పరారీలో... వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన మెకానికల్ ఇంజనీర్ మూడు నెలలుగా కనిపించకుండా పోయి, చివరకు అనుమానస్పద స్థితిలో శవమై కనిపించాడు. అవసరం కోసం పిలిచిన తెలిసిన వారే హతమార్చారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనకు సంబంధించి కువైట్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామా బాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరట్ పల్లి తండాకు చెందిన గుగులోత్ కైలాశ్ (29) మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి...