లవర్ కోసం భర్తను చంపిన భార్య. - సెలైన్లో టాయిలెట్ క్లీనర్ ఎక్కించి ఘాతుకం.
"అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, ప్రియుడితో కలసి భర్తను చంపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భర్త ఉద్యోగం నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు.. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఇటీవల గల్ప్ నుంచి భర్త ఇంటికి తిరిగి రావడంతో తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తాడని భావించిన భార్య అతన్ని సెలైన్లో టాయిలెట్ క్లీనర్ ఎక్కించి మరి చంపిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి". వేగుచుక్క న్యూస్: నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ (35) గల్ఫ్ లో ఉద్యోగం చేస్తూ జూన్ 27న స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే, అతని...