విప్లవోద్యమ సాంస్కృతిక సారధి కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు విప్లవ జోహార్లు *

విప్లవోద్యమ సాంస్కృతిక రంగం ఒక అపూర్వమైన యోధుడిని కోల్పోయింది. ప్రజల కోసం తన గొంతును ఆయుధంగా, పాటను పోరాట పిలుపుగా, కళను సామాజిక మార్పు సాధనంగా మార్చుకున్న కామ్రేడ్ అరుణోదయ నాగన్న అమరత్వం చెందడం తీవ్ర విషాదకరం. ప్రజా ఉద్యమాల చరిత్రలో కొందరు తుపాకీతో పోరాడతారు, మరికొందరు కలంతో పోరాడతారు. నాగన్న మాత్రం పాటతో ప్రజలను చైతన్యపరిచిన సాంస్కృతిక యోధుడు. గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, కార్మిక బస్తీలు, రైతు గూడెలు,ఎక్కడ ప్రజా బాధ ఉందో అక్కడ ఆయన గొంతు వినిపించింది. ఆయన పాడిన ప్రతి గీతం అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు నినాదమైంది. అరుణోదయ సాంస్కృతిక ఉద్యమానికి పునాదులు బలపడుతున్న కాలంలో అరుణోదయ రామారావు, కానూరి వంటి...